సమతా చైతన్య ర్యాలీ జయప్రదం చేయండి

సమతా చైతన్య ర్యాలీ జయప్రదం చేయండి

user-default | Mob: | 31 Oct

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 25 : డాక్టర్ బి ఆర్ అంబెడ్కర్ జిల్లాకు వచ్చి 75 సంవత్యరాలు ఆయన సందర్బంగా జరుపుతున్న 75 వ సంవత్యర సిల్వర్ జూబ్లీ వేడుకలను ప్రజలంతా విజవంతం చేసేలా చూడాలని ర్యాలీ చీఫ్ కన్వీనర్ డి ఎం ఆర్ శేఖర్ పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక జయరాజు నివాసంలో కన్వీనర్ మర్రి బాబ్జి అధ్యక్షతన సన్నాహక కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా డి ఎం ఆర్ శేఖర్ మాట్లాడుతూ ఈ నెల 28 తేదీన కాకినాడ నుండి రాజమహేంద్రవరం వరకు అంబెడ్కర్ నడయాడిన నేలపై జరిపే ర్యాలీకి ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా చూడాలని కోరారు. ఈ ర్యాలీని కాకినాడలో సాంఘిక సంక్షేమ శాఖామాత్యులు పినిపే విశ్వరూప్, జిల్లా కలెక్టర్ మురళీకృష్ణ ర్యాలీని పారంభిస్తారని తెలిపారు. ఈ ర్యాలీ కాకినాడ నుండి రామచంద్రపురం, ద్రాక్షరామం, యానాం, అమలాపురం, అంబాజీపేట, కొత్తపేట, రావులపాలెం, జొన్నడ, మండపేట, కడియం, ధవళేశ్వరం, ఐ ఎల్ టి డి మీదుగా రాజమహేంద్రవరం అంబెడ్కర్ విగ్రహం వరకు చేరుతుందని అన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎక్స్ సర్వీస్ మేన్ రి సెటిల్మెంట్ కో ఆర్డినెట్ కో - అపరేటివ్ సొసైటీ అధ్యక్షులు దాసి వెంకట్రావు, గార్డ్స్ ఫర్ RTI జాతీయ కన్వీనర్ వరదా నాగేశ్వరరావు, మాజీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ బర్రె కొండబాబు, AP షెడ్యూల్డ్ రైట్స్ కమిటీ నాయకులు కాశీ నవీన్, బి సి. ఎస్ సి. ఎస్ టి. మైనారిటీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్ వి ప్రసాద్, ఏ సునీల్ కుమార్, ఎల్ ఐ సి ఎంప్లాయిస్ నాయకులు తాళ్లూరి బాబూ రాజేంద్రప్రసాద్, ఎస్ సి ఎస్ టి ఉద్యోగుల జిల్లా అధ్యక్షులు కోరుకొండ చిరంజీవి , గిరిజన సంఘం నాయకులు ఎస్ గన్నయ్య, ఏ పి ఎస్ ఈ బి ఎస్ సి ఎస్ టి ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ రీజనల్ వర్కింగ్ అధ్యక్షులు పి. సతీష్, యువత జిల్లా అధ్యక్షులు ఎల్ ప్రభు అంబెడ్కర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved